నజ్రియా నజీమ్.. రాజా రాణి డబ్బింగ్ సినిమాతోనే తెలుగులో విపరీతమైన క్రేజ్ సాధించింది. ఆ సమయంలోనే ఈమె తెలుగులో అడుగుపెట్టొచ్చని అంతా అనుకున్నారు కానీ, అలా జరగలేదు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ‘అంటే సుందరానికీ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈనెల 10వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే నజ్రియా సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలతో పాటు తన మనసులోని మాటల్ని పంచుకుంది. ముఖ్యంగా.. తాను ఏయే తెలుగు హీరోలతో కలిసి…
ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా లెవల్లో తమ సినిమాలు నిలవాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కథ, దర్శకుడు, నిర్మాణం లాంటివి హై రేంజ్ లో ఉండాలని చూస్తున్నారు. కుర్ర హీరోలతో సహా అందరు పాన్ ఇండియా మూవీలను మొదలుపెట్టేశారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబును కూడా పాన్ ఇండియా లెవల్ హీరోగా చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఇప్పటికే హిందీ లో సినిమాలు చేయడం వేస్ట్ అని స్టేట్మెంట్ ఇచ్చిన మహేష్..…
‘మేజర్’ ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా.. హీరోగా అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభిత ధూలిపాళ్ల నాయికలుగా నటించారు. తాజాగా హైదరాబాద్‌లో ‘మేజర్’ సక్సెస్‌మీట్ నిర్వహించారు. ‘మేజర్ సందీప్‌కు మేమిచ్చిన నివాళి ఈ సినిమా అంటూ అడివి శేష్ అన్నారు. ఇదొక ఆరంభం మాత్రమే. ఇలాంటి గొప్ప చిత్రాలను ఇంకా రూపొందించాలని అనుకుంటున్నాం. ఈ సినిమా చూసి సైన్యంలో చేరుతామనంటూ చాలా మంది చెప్పడం సంతోషంగా…
టాలీవుడ్లో పవన్ కళ్యాణ్, మహేశ్ బాబులకు ఎంత క్రేజ్, మార్కెట్, ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈ హీరోలతో కలిపి పని చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ నుంచి స్టార్ హీరోయిన్ల దాకా.. క్యూలో నిల్చొంటారు. అలాంటి ఆ ఇద్దరు హీరోలకు.. పూజా హెగ్డే హ్యాండ్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా విజయ్ దేవరకొండ కోసం ఈ అమ్మడు ఆ పని చేసింది. కొన్ని రోజుల నుంచి తానో యాక్షన్ సినిమాలో…
అడివి శేష్ టైటిల్ రోల్లో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మేజర్’ సినిమాపై సర్వత్రా ప్రశంసలు వచ్చి పడుతున్నాయి. ఒక మంచి సినిమా తీశారని యూనిట్ సభ్యుల్ని శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. సాధారణ ఆడియన్సే కాదు, సినీ ప్రముఖులు సైతం ఈ చిత్రంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. రీసెంట్గా ఈ సినిమా చూసి ఫిదా అయిన బన్నీ, తన అనుభూతిని ట్విటర్ మాధ్యమంగా పంచుకున్నాడు. ‘‘మేజర్…
అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సర్కారు వారి పాట’.. రిలీజైన మూడు వారాలకే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. కానీ, ఇక్కడో చిన్న మెలిక ఉంది. ఈ సినిమాని ఓటీటీలో చూడాలంటే.. రూ. 199 చెల్లించాలి. అంటే.. పే-పర్-వ్యూ విధానంలో ఈ సినిమాని ఇప్పుడే ఓటీటీలో వీక్షించొచ్చు. తొలుత ‘కేజీఎఫ్: చాప్టర్2’ ఇదే విధానంలో అందుబాటులోకి తెచ్చింది ప్రైమ్ వీడియో.…
అడివి శేష్ ప్రధాన పాత్రలో శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మేజర్’. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. జూన్ 3 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమాను జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించిన…
సోషల్ మీడియా పెరిగిన తర్వాత రోజూ పలు రకాల గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇక టాలీవుడ్ లో రకరకాల కాంబినేషన్స్ లో సినిమా అంటూ రూమర్స్ వింటూనే ఉన్నాం. అయితే వాటిలో కొన్ని కార్యరూపం దాల్చిన సందర్భాలు లేకపోలేదు. ఎక్కువగా ఈ రూమర్స్ చెవులను తాకి వెళ్ళిపోతుంటాయి. అలాంటి రూమర్ ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాజమౌళి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో సినిమా అన్నదే ఆ…
టాలీవుడ్ అలనాటి హీరో సూపర్‌స్టార్ కృష్ణ నేడు 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘నాన్న.. పుట్టినరోజు శుభాకాంక్షలు! నీలాగా మరెవ్వరూ లేరు. మరింత ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ’’ అంటూ మహేశ్ ట్వీట్ చేశాడు. మహేశ్ భార్య నమ్రతా సైతం మామయ్యకు బర్త్ డే విషెస్ తెలిపింది. ‘‘కొన్ని సంవత్సరాల నుంచి మీతో మాకెన్నో జ్ఞాపకాలున్నాయి. మీరు నా జీవితంలో ప్రేమ, దయ,…
సర్కారు వారి పాటతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే! ఆ తర్వాత ఆయన దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఓ అడ్వెంచరస్ యాక్షన్ త్రిల్లర్ (SSMB29) చేయనున్నాడు. ఆర్ఆర్ఆర్తో జక్కన్న సూపర్ బ్లాక్‌బస్టర్ అందుకోవడం, మహేశ్ బాబుకీ జాతీయంగా మంచి క్రేజ్ ఉండడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు మించే ఈ సినిమాని తెరకెక్కించేందుకు జక్కన్న ప్రణాళికలు రచిస్తున్నాడని వార్తలొస్తున్నాయి.…