Pokiri Mania Begins: మళ్లీ వెండితెరపైకి పండుగాడు.. సిద్ధమవ్వండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PokiriManiaBegins: సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన పోకిరి సినిమా టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. 2006లో విడుదలైన ఈ మూవీ పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా రిలీజై 16 ఏళ్లు దాటినా ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ టీవీల్లో వస్తే అభిమానులు వదలకుండా వీక్షిస్తుంటారు. తాజాగా ఈ సినిమా మరోసారి వెండితెరపైకి వస్తోంది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని పలు థియేటర్లలో పోకిరి సినిమాను విడుదల చేయబోతున్నారు. 4K ఆల్ట్రా హెచ్‌డీ, డాల్బీ ఆడియో టెక్నాలజీతో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ మేరకు మహేష్ అభిమానులు PokiriManiaBegins అనే హ్యాష్ ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.
Read Also: Sita Ramam Trailer: సీత కోసం వెతుకుతున్న రష్మిక.. ఇంతకీ రామ్ ఎవరు?
Also Read
ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు థియేటర్లలో పోకిరి ప్రత్యేక ప్రదర్శనలు వేసేందుకు మహేష్ అభిమాన సంఘాలు సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆగస్టు 9న మరోసారి పోకిరి సినిమాను వెండితెరపై చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మూవీలో ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు అంటూ మహేష్ చెప్పిన డైలాగ్‌ను ఎవరూ మరిచిపోలేరు. ఈ డైలాగ్‌లో పలువురు కమెడియన్‌లు తమ సినిమాల్లో స్పూఫ్‌లు కూడా చేశారు. ఈ చిత్రంలో మహేష్ సరసన ఇలియానా నటించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం, మణిశర్మ సంగీతం ఈ మూవీని టాప్‌లో నిలబెట్టాయి. త్వరలోనే పోకిరి మూవీ ప్రీమియర్ షోలకు సంబంధించిన టిక్కెట్లను బుక్ మై షో, పేటీఎం వంటి ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో విక్రయించనున్నట్లు సమాచారం.
Witness the #Pokiri Mania once again❤️🔥🔥 Theatres are going to ERUPT with the Arrival of Pandu gadu on Big screens on August 9th💥💥 #PokiriManiaBegins Super 🌟 @urstrulyMahesh #PanduGaduArriving #MaheshBabu #SSMB #PokiriManiaBegins
— BA Raju's Team (@baraju_SuperHit) July 24, 2022
తాజావార్తలు
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!