PokiriManiaBegins: సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన పోకిరి సినిమా టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. 2006లో విడుదలైన ఈ మూవీ పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా రిలీజై 16 ఏళ్లు దాటినా ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ టీవీల్లో వస్తే అభిమానులు వదలకుండా వీక్షిస్తుంటారు. తాజాగా ఈ సినిమా మరోసారి వెండితెరపైకి వస్తోంది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని పలు థియేటర్లలో పోకిరి సినిమాను విడుదల చేయబోతున్నారు. 4K…
ఇటీవల వరుసగా ‘డాక్టర్, డాన్’ సినిమాలో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తదుపరి ‘మహావీరుడు’గా రాబోతున్నాడు. శుక్రవారం తన తాజా సినిమాను యాక్షన్ ఎపిసోడ్ తో పరిచయం చేస్తూ టైటిల్ రివీల్ చేశాడు. ఇది ద్విభాషా. మావీరన్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి మడోన్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ ప్రకటన వీడియోను ఈరోజు విడుదల చేశారు. తమిళ, తెలుగు భాషల్లో రానున్న ఈ సినిమాకు తమిళంలో ‘మావీరన్’…
టాలీవుడ్ లో స్టార్ హీరోలు మొత్తం కలుపుకొని ఒక పదిమంది వరకు ఉన్నారు. వారందరు అచ్చ తెలుగు గడ్డమీద పుట్టినవారే.. తాతలు, తండ్రులు, కొడుకులుగా నట వారసత్వాన్ని పెంచుకొంటూ వస్తున్నారు.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో రెండు హీరోయిన్లను తీసుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. ఇప్పుడు మహేశ్‌బాబుతో చేయనున్న సినిమాకూ అదే స్ట్రాటజీని అనుసరిస్తున్నాడు. ఆల్రెడీ ఒక కథానాయికగా పూజా హెగ్డే కన్ఫమ్ అయ్యింది. కానీ, రెండో హీరోయిన్ పాత్రకే ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. మొదట్లో మీనాక్షి చౌదరి పేరు బాగా చక్కర్లు కొట్టింది. ‘ఖిలాడి’ సినిమాలో రవితేజ సరసన నటించిన ఈ బ్యూటీకి ఫిదా అయి, త్రివిక్రమ్ ఈమెను మహేశ్ బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్గా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని దుమ్ముదులుపుతున్నాడు. ఒక్క హీరోగానే కాదు.. నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు మహేష్. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్లో సత్తా చాటిన మహేష్.. రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోబోతున్నాడు. అయితే ఈ లోపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో రాజకీయం చేయబోతున్నట్టు తెలుస్తోంది.…
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. రూ. 200 కోట్ల పైచిలుకు వసూళ్లను రాబట్టింది. అయితే.. ఇందులో మరికొన్ని మార్పులు చేసి ఉంటే, మరింత పెద్ద హిట్ అయ్యేదని ప్రముఖ రచయిత పరచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. ‘పరుచూరి పాఠాలు’ పేరుతో కొత్త చిత్రాలపై తన అభిప్రాయాల్ని వెల్లడిస్తోన్న ఈయన.. తాజాగా సర్కారు వారి పాటలోని తప్పుల్ని ఎత్తిచూపారు. ‘సర్కారు వారి పాట’…
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేశ్ చేయనున్న సినిమా ముగిసిన అనంతరం.. ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది పట్టాలెక్కడానికి చాలా సమయమే ఉన్నప్పటికీ.. ఇందుకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతవరకూ…
మహేశ్ బాబు తదుపరి సినిమాపై క్లారిటీ వచ్చేసింది. రాజమౌళి సినిమా కంటే ముందే త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు మహేశ్. ఆగస్ట్ నుంచి షూటింగ్ ప్రారంభం అయ్యే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల అవుతుందని అధికారికంగా ప్రకటించటం విశేషం. త్రివిక్రమ్ తో మహశ్ ఇంతకు ముందు ‘అతడు’, ‘ఖలేజా’ వంటి సినిమాలు చేశాడు. టీవీల్లో అత్యధిక సార్లు ప్రసారం అయిన సినిమాల్లో ఈ రెండింటికి ప్రత్యేక స్థానం ఉంది.ఈ సినిమాలో పూజా హేగ్డే…