టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. “సర్కారు వారి పాట” సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా, భారీ పోటీ కారణంగా వాయిదా వేసుకున్నారు మేకర్స్. ఈ చిత్రం 2022 ఏప్రిల్ 1న విడుదలకు…