టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. “సర్కారు వారి పాట” సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా, భారీ పోటీ కారణంగా వాయిదా వేసుకున్నారు మేకర్స్. ఈ చిత్రం 2022 ఏప్రిల్ 1న విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా నిన్న దర్శకుడు పరశురామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా “సర్కారు వారి పాట” ఆయనను విష్ చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. నిన్న సాయంత్రం మహేష్ కూడా ఓ స్పెషల్ పిక్ తో పరశురామ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మహేష్ ట్విట్టర్‌లో ప్రతిభావంతుడైన డైరెక్టర్ పరశురామ్ ఎప్పుడూ మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని కోరుకున్నాడు. దర్శకుడితో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్ చేశాడు. ఆ పిక్ లో మహేష్ పింక్ కలర్ షర్ట్ లో కూల్ లుక్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఈ పిక్ చూస్తుంటే మహేష్ బాబు ఏజ్ రోజురోజుకూ మరింత తగ్గితున్నట్టుగా అన్పిస్తోంది. ఈ పిక్ ను షేర్ చేస్తూ మహేష్ అభిమానులు ట్విట్టర్లో #SarkaruVaariPaataOnApril1 అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
Wishing our director @ParasuramPetla a very happy birthday! Health and happiness always! 😊 pic.twitter.com/VfRzAQfIVy
— Mahesh Babu (@urstrulyMahesh) December 25, 2021