మహారాష్ట్రలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రవాహం కారణంగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. మహారాష్ట్ర విపత్తు పరిస్థితుల నివేదిక ప్రకారం జూన్ 1 నుండి మహారాష్ట్రలో సంభవించిన వర్షం, వరదలకు సంబంధించిన సంఘటనలలో మొత్తం 102 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. పలు ప్రాంతాలను వరదలతో ముంచెత్తాయి. ఇక, భారీవర్షాల కారణంగా రాయగఢ్ జిల్లాలో మూడు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 36 మంది మరణించినట్టు అధికారులు చెబుతున్నారు.. మరికొంతమంది గల్లంతు కాగా.. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు.. సహాయక చర్యలు చేపట్టాయి.. ఇప్పటికే కొందరిని కాపాటినట్టు తెలుస్తుండగా.. శిథిలాల కింది ఎంతమంది చిక్కుకున్నారనేదానిపై వివరాలు లేవు..…