వివాదాస్పద మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌కు సంబంధించిన వార్త మరోసారి హల్‌చల్ చేస్తోంది. ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. అహ్మద్‌నగర్‌లోని షెవ్‌గావ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.