మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రమాణ స్వీకారానికి డిసెంబర్ 5 తేదీని కూడా ప్రకటించినప్పటికీ ముఖ్యమంత్రి ముఖంపై ఉత్కంఠ నెలకొంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరు? అన్న ప్రశ్నకు నేడు సమాధానం దొరకనుంది. షిండేతో బీజేపీ చర్చలు జరుపుతుండగా.. ఆయన గ్రామానికి వెళ్లడంతో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చర్చ మొదలైంది.
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం ప్రమాణస్వీకారోత్సవ తేదీని బీజేపీ ఖరారు చేసినప్పటికీ ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా.. తదుపరి ముఖ్యమంత్రి ఎవరో మహారాష్ట్ర ప్రజలకు కూడా తెలుసని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రావుసాహెబ్ దన్వే అన్నారు. ఇప్పుడు పార్టీ హైకమాండ్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి 6 రోజులు గడుస్తున్నా.. సీఎం నిర్ణయం తూతూమంత్రంగా సాగుతోంది. షిండేను ఒప్పించేందుకు బీజేపీ పలు ప్రతిపాదనలు చేసినా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎక్‌నాథ్ షిండే మాత్రం అంగీకరించలేదు. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శుక్రవారం ముంబైలో జరగాల్సిన కూటమి సమావేశం కూడా వాయిదా పడింది. సమావేశానికి ముందు షిండే తన సొంత గ్రామానికి వెళ్లారు. సీఎం పదవి కంకణం కట్టుకున్న…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ అవుతారని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి సంచలనం సృష్టించింది. మహాయుతి కూటమి 235 మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగా, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి 49 మాత్రమే సాధించింది. తాజాగా తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. 288 సీట్లకు గాను 132 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని కమలం పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా.. మళ్లీ తానే సీఎం అవుతానని ఎక్‌నాథ్ షిండే ధీమా…