మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి సంచలనం సృష్టించింది. మహాయుతి కూటమి 235 మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగా, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి 49 మాత్రమే సాధించింది. తాజాగా తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. 288 సీట్లకు గాను 132 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని కమలం పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా.. మళ్లీ తానే సీఎం అవుతానని ఎక్‌నాథ్ షిండే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: NTR 75 : ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం..ఫేస్ బుక్ లో బాలయ్య ఇంట్రెస్టింగ్ పోస్ట్
ఏదైనా సర్ ప్రైజ్ ప్లాన్ ఉందా?
మోడీ-షాలు తరచూ సర్ ప్రైజ్ ప్లాన్లు వేస్తూ ఉంటారు. గత ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఇదే జరిగింది. ఎన్నికలకు ముందే హర్యానాలో జరిగిన ఘటన గురించి తెలిసిందే. ఏకంగా.. ఓడిపోయిన పుష్కర్ సింగ్ ధామీని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని చేశారు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. అయితే.. తొలుత మహాయుతిలో సీట్ల ప్రాతిపదికన ముఖ్యమంత్రి అవుతారనే టాక్ వినిపించింది. దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఇంతకు ముందు కూడా ఇలాంటి సూచనలే ఇచ్చారు.
READ MORE: Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు..
బీజేపీ ఏకనాథ్ షిండే నాయకత్వంలో ఎన్నికల పోరాటం జరుగుతోందని గట్టిగా పునరుద్ఘాటించింది. ఇటీవల ఎన్నికల సభలో సీఎం అభ్యర్థిపై అమిత్ షా చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అని, అయితే ఎన్నికల తర్వాత అందరం కూర్చుని తదుపరి సీఎం ఎవరు కావాలన్న అంశంపై చర్చిస్తామని అమిత్ షా అన్నారు. అయితే.. కేంద్రంలో ఏకనాథ్ షిండేకు స్థానం కల్పించాలనే చర్చ ఇప్పటికే మొదలైంది. ఒకవేళ ఏక్‌నాథ్ షిండే అంగీకరించని పక్షంలో దేవేంద్ర ఫడ్నవీస్ స్థానంలో మరో పేరును బీజేపీ పరిశీలించే అవకాశం ఉంది.