Vande Mataram Row: సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అసిమ్ అజ్మీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. వందేమాతరం పాడమని నన్ను ఎవరూ బలవంతం చేయలేరు అన్నారు. బీజేపీ అంటే భారత్ జలావ్ పార్టీ.. అది భారతదేశాన్ని నాశనం చేసే పార్టీ అని ఆరోపించారు.