శుక్రవారం మహారాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భారీగా తాయిలాలు ప్రకటించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీగా నష్టపోయింది. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో డీలా పడింది.
లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను రాష్ట్ర ప్రభుత్వాలు పెంచేస్తు్న్నాయి. ఇప్పటికే కర్ణాటక, గోవా లాంటి రాష్ట్రాల్లో ఫ్యూయిల్ ధరలను పెంచేశాయి. కానీ మహారాష్ట్రలో మాత్రం విచిత్రమైన పరిస్థితి చోటుచేసుకుంది.
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని సర్కారు తమ మొదటి బడ్జెట్‌ను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2023-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.