Uddhav Thackeray: మహారాష్ట్ర ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే పార్టీలన్నీ తమ అభ్యర్థుల్ని ఖరారు చేశాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు భారీ దెబ్బ పడింది. ఆ పార్టీ నుంచి టికెట్ పొందిన అభ్యర్థి, తాను పోటీ చేయడం లేదని తేల్చి చెప్పాడు. శివసేన-యూటీటీ నుంచి ఔరంగాబాద్‌లో పోటీ చేయడానికి టికెట్ పొందిన అభ్యర్థి కిషన్ చంద్ తన్వానీ తన అభ్యర్థిత్వాన్ని వదులుకున్నారు.
AAP: మహారాష్ట్రలో వచ్చే నెల జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పోటీ చేయడం లేదని ప్రకటించింది. మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ-ఎస్పీ, ఉద్ధవ్ ఠాక్రే సేవ కోసం ప్రచారం చేస్తారని ఆ పార్టీ నే సంజయ్ సింగ్ శనివారం చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ(శరద్ పవార్)-ఉద్ధవ్ ఠాక్రే శివసేన ‘‘మహా వికాస్ అఘాడీ(MVA)’’ పేరుతో కూటమిగా పోటీ చేస్తున్నాయి.
Maharashtra Assembly Elections: దేశం మొత్తం మహారాష్ట్ర్ర అసెంబ్లీ ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తోంది. హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం, జమ్మూ కాశ్మీర్‌లో ఫలితాల తర్వాత మహారాష్ట్ర ఫలితాలు ఎలా ఉండబోతాయా..?
RSS: మహారాష్ట్ర ఎన్నికలకు మరో నెల మాత్రమే సమయం ఉంది. నవంబర్ 20న ఎన్నికలు నిర్వహిస్తే, 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘‘మహావికాస్ అఘాడీ’’ మధ్య పోరు నెలకొంది. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కూటమి భావిస్తోంది. ఇటీవల హర్యానాలో ఎన్నికల్లో గెలుపు మహారాష్ట్ర బీజేపీలో కూడా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. అందరి కన్నా ముందుగా బీజేపీ 99 మందితో తన తొలి జాబితాను ఆదివారం విడుదల చేసింది.
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇగత్‌పురి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే హిరామన్ భికా ఖోస్కర్ అజిత్ పవార్ నేతృత్వంలోని-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
Maharastra : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, డిప్యూటీ సీఎం, సీనియర్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ కార్యాలయం వెలుపల ఒక గుర్తు తెలియని మహిళ హంగామా సృష్టించింది..
Sharad Pawar: లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ)తో కలిసి పోరాడిన శరద్ పవార్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన వైఖరిని ప్రదర్శించింది. పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లోనే పోటీ చేశాం.. కానీ, అసెంబ్లీలో మాత్రం మా పార్టీ రాజీపడదని శివసేన, కాంగ్రెస్ పార్టీలకు స్పష్టం చేశారు.