ఉత్కంఠ వీడిపోయింది. తిరుపతిలో బహిరంగసభకు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి బహిరంగ సభ అనుమతిపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం తరుపు వాదనలు వినిపించారు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పిటిషనర్ల తరుపు వాదనలు వినిపించారు న్యాయవాది లక్ష్మీనారాయణ. తిరుపతిలో రాజధాని రైతుల బహిరంగ సభ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తిరుపతి బహిరంగ సభకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. మహా పాదయాత్ర ముగింపు…
అమరావతి రాజధాని పరిరక్షణే ధ్యేయంగా అమరావతి రైతులు, రైతు సంఘాలు, మహిళలు, వైసీపీయేతర పార్టీలు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర 24 రోజులుగా అవిశ్రాంతంగా సాగుతోంది. ఏపీ రాజధాని పరిరక్షణ కోసం అలుపెరగని పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు, మహిళలకు రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు, ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. 24 రోజులుగా యాత్ర చేసి కాళ్లు బొబ్బలెక్కిన మహిళలకు నరసరావుపేటలో అపూర్వ గౌరవం లభించింది. టీడీపీ ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్‌బాబు పాలాభిషేకం చేశారు. నిర్విఘ్నంగా…
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ్టికి పన్నెండవ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరింది. రైతులు తలపెట్టిన పాదయాత్రకు ఒంగోలు నగరంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అమరావతి రైతులకు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, జనసేన,సీపీఐ, సీపీఎం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆనాడు అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచుతామనే హామీవల్లే తమ విలువైన భూములు ఇచ్చామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మూడు…
రాజధానిగా అమరావతిని అమలుచేయాలంటూ రైతులు, ప్రజాసంఘాలు చేపట్టిన పాదయాత్రకు కోర్టు అనుమతిచ్చినా పోలీసులు మాత్రం ఆంక్షలు విధిస్తున్నారు. విచ్చలవిడిగా రోడ్లపై రచ్చ చేసే వైసీపీ వాళ్లకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు, లౌడ్ స్పీకర్లు రైతుల మహా పాదయాత్రకే అడ్డొచ్చాయా డీజీపీ గారు అంటూ మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. వైసీపీ ర్యాలీలకు రెడ్ కార్పెట్ వేస్తున్న పోలీసులు అమరావతి రైతుల మహా పాదయాత్రకు అడ్డంకులు కల్పిస్తూ నోటీసులిస్తున్నారు. అమరావతిని చంపేసి ఉద్యమాన్ని అణిచేయాలనే…