అతనికి చిన్నతనం నుంచి రైతు కావాలని కల. రైతుగా మారడానికి చిన్నతనం నుంచి చాలా కష్టపడ్డాడు. కష్టపడి పనిచేశాడు మహాలింగ నాయక్. ఎంత కష్టపడినా ఉండేందుకు చిన్న గుడిసెను కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాడు. రైతుగా మారాలంటే పొలం కావాలి. పోలం లేకుండా వ్యవసాయం చేయడం చాలా కష్టం. అయితే, తాను పనిచేసే యజమాని వద్ద చాలా కాలం మహాలింగ నాయక్ నమ్మకంగా పనిచేశాడు. నాయక్ పని నచ్చడంతో అతనికి యజమాని మంగుళూరుకు 55 కిలోమీటర్ల దూరంలోని అద్యనాదక్…