Mamta Kulkarni: బాలీవుడ్ ఒకప్పటి అందాల నటి మమతా కులకర్ణి ఇటీవల సన్యాసిగా మారి వార్తల్లో నిలిచారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఆమె సన్యాసిగా మారారు. అయితే, ఆమె తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. కిన్నార్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేస్తు్నట్లు అధికారికంగా ప్రకటించారు. సాధ్విగా తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తానని చెప్పారు.
ఇప్పుడు ఈ మహామండలేశ్వర్‌గా నియమించడం వివాదాస్పదమైంది. తాజాగా కిన్నార్ అఖాడా నుంచి మమతా కులకర్ణితో బహిష్కరించారు. ఆమెతో పాటు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని కూడా బహిష్కరించారు. కిన్నార్ అఖాడా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ వీరిద్దరి నుంచి అఖాడా నుంచి బహిష్కరించినట్లు తెలిసింది. మమతా కులకర్ణిని మహామండలేశ్వర్‌గా నియమించడం వివాదాస్పదం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Mahakumbh 2025 : ప్రయాగ్‌రాజ్‌లోని సంగం ఒడ్డున జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా వివిధ రంగాలలో సుమారు 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా.