Maha kumbh mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరగబోతున్న మహా కుంభ మేళాకి అంతా సిద్ధమైంది. ఇప్పటికే, యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. మహా కుంభమేళా జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. అయితే, ఈ కుంభమేళాలో ముస్లిం మతస్తులు కొన్ని రకాల షాపులు పెట్టుకోవడంపై వివాదం నడుస్తోంది.
Khalistani terrorist: ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత్‌ని బెదిరించాడు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరగబోయే ‘‘మహా కుంభమేళా’’పై దాడులు నిర్వహించి, భగ్నం చేస్తామని బెదిరింపులు జారీ చేశాడు.
Maha Kumbh Mela 2025: వచ్చే నెల 13 నుంచి 45 రోజుల పాటు కొనసాగనున్న మహా కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్ రెడీ అయింది. భక్తుల అవసరాలు, భద్రత కోసం ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తోంది.
మహా కుంభమేళా 2025 జనవరి 13 నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా దాదాపు 50 రోజుల పాటు కొనసాగుతుంది. మహాకుంభం ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా చెబుతారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఇందులో పాల్గొంటారు. రాజ స్నానాలు ఆచరిస్తారు. ప్రయాగ్‌రాజ్‌లో చివరిసారిగా 2012లో మహా కుంభమేళా జరిగింది.