Ujjain Case: ఉజ్జయిని అత్యాచార ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. 15 ఏళ్ల బాలిక దారుణంగా అత్యాచారానికి గురై సాయం కోసం బతిమిలాడితే కనీసం ఒక్కరు కూడా పట్టించుకోలేదు. చివరకు రూ.50, 100 ఇవ్వాలని ప్రయత్నించారే తప్పితే తీవ్ర వేధనతో బాధపడుతున్న బాలికను ఆస్పత్రిలో చేర్చాలని చూడలేదు. ఈ అత్యాచార ఘటనలో ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది కళ్లకు కట్టినట్లు చూపించింది.