విశాఖలోని మధురవాడలో వందల కోట్ల రూపాయల విలువైన భూములపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. NCC కంపెనీకి 2005 అక్టోబర్ 10న అప్పటి ప్రభుత్వం నిబంధనల ప్రకారమే కేటాయింపులు జరిగాయని మంత్రి బొత్స తెలిపారు. 2013 వరకు NCC కంపెనీ ఒప్పందం ప్రకారం నిర్మాణాలు ప్రారంభించలేదన్నారు. దీంతో ఒప్పందం రద్దు చేసుకోవాలని 2013లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించడంతో NCC కంపెనీ న్యాయస్థానం ఆశ్రయించిందని బొత్స పేర్కొన్నారు. దీనిపై ఆర్బిట్రేషన్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో NCC…