కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'డెజావు'. విమర్శకుల ప్రశంసలూ అందుకున్న ఈ సినిమా తెలుగు వర్షన్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతూ చక్కని ఆదరణ పొందుతోంది.
త్రిగుణ్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన 'ప్రేమదేశం' చిత్రంలో మధుబాల కీలక పాత్ర పోషించారు. అవకాశం ఇవ్వాలే కానీ కామెడీతో పాటు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రనూ తాను చేస్తానని ఆమె చెబుతున్నారు.
మణిరత్నం క్లాసిక్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటైన ‘రోజా’లో తన అద్భుతమైన నటనతో ప్రజల హృదయాలను దోచుకున్న నటి మధుబాల. శనివారం నాడు ఈ బ్యూటీ తాను నటి సాయి పల్లవికి అతి పెద్ద అభిమానిని అని పేర్కొంది. మధుబాల ట్విట్టర్‌లో ఒక వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ “అందరికీ హాయ్, నేను నిన్న ‘శ్యామ్ సింఘా రాయ్’ చూశాను. ఇది నేను ఇటీవల చూసిన అత్యంత అద్భుతమైన చిత్రం. నేను సాయి పల్లవికి పెద్ద అభిమానిని” అంటూ చెప్పుకొచ్చింది.…
అజయ్ దేవగణ్… ఈ పేరు తెలియనివారు ఉండరు. మాస్ హీరోగా అజయ్ దేవగణ్ జనం మదిలో నిలచిపోయారు. తనదైన అభినయంతోనూ అలరించారు. ఓ నాటి మేటి హీరోయిన్ కాజోల్ భర్త అజయ్. హీరోగా ఆయన తొలి చిత్రం ‘ఫూల్ ఔర్ కాంటే’. ఈ మొదటి సినిమాతోనే అజయ్ మంచి పేరు సంపాదించారు. ఈ చిత్రానికి ప్రముఖ నటి అరుణా ఇరానీ భర్త కుకు కోహ్లి దర్శకుడు. ఈ సినిమాతోనే హేమామాలిని మేనకోడలు మధూ నాయికగా పరిచయమయ్యారు. అజయ్,…
కాలం ఎంత వేగంగా సాగిపోతోందో తెలుసు కోవాలంటే… పాత సినిమాలు విడుదలైన రోజుల్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అప్పట్లో సూపర్ హిట్ అయిన సినిమాలన్నీ నిన్నోమొన్నో వచ్చినట్టే అనిపిస్తుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘రోజా’ సినిమా 1992 ఆగస్ట్ 15న విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ మ్యూజికల్ హిట్ మూవీలో అందమైన జంటగా నటించారు అరవింద్ స్వామి, మధుబాల. ఆ తర్వాత కాలచక్రం వడివడిగా సాగిపోయింది. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించిన మధుబాల పెళ్ళి చేసుకుని…