మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో పోటీదారుల లిస్ట్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రెసిడెంట్ పదవికి ప్రకాశ్‌రాజ్ బరిలోకి దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మంచు వారి అబ్బాయి మంచు విష్ణు పేరు తెరపైకి వచ్చింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి మాట్లాడిన తర్వాతే విష్ణు ప్రకటన చేస్తారని సమాచారం. మంచు విష్ణు బరిలోకి దిగితే ప్రకాష్ రాజ్ కు మద్దతు ఎలా వుంటుందన్నది చూడాలి. ప్రకాష్ రాజ్ నాన్-లోకల్ కావడంతో ఆవైపుగా మద్దతు వుంటుందా లేదా అని ఆసక్తికరంగా మారింది. అయితే ‘తెలుగు సినిమా పరిశ్రమపై తనకు అవగాహన ఉందని.. నటీనటులను ఏకతాటిపై తీసుకొస్తాను’ అంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. మరోవైపు మంచు విష్ణుకు సిట్టింగ్ ప్రెసిడెంట్ నరేష్ మద్దతు లభించే అవకాశం కనిపిస్తోంది.