మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడకముందే రాజీనామాల పర్వం మొదలైంది. గతంలో ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు హుందాగా తమ ఓటమిని అంగీకరించి, ముందుకు సాగిపోయారు. లేదంటే మౌన ప్రేక్షకుడి పాత్రపోషించారు. కానీ ఆదివారం ఫలితాలు రాగానే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు వెనక బాసటగా ఉన్న నాగబాబు ‘ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం తనకు ఇష్టం లేక ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు…