కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు దర్యాప్తును అణచివేసేందుకు ప్రయత్నించారంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. మరోవైపు.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అబద్ధాలు చెబుతున్నారని బాధితురాలి తల్లి ఆరోపించింది. తనకు పరిహారం కూడా అందజేస్తామని చెప్పినట్లు పేర్కొంది. కాగా.. ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారనే ఆరోపణలను మమత ఖండించారు.