తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం.. టీటీడీ అంటే భక్తుల నుంచి విరాళాలు సేకరించడం అని కాకూండా.. భక్తులకు మెరుగైన సేవలందించడంపై దృష్టి సారించాలన్నారు.
ఏపీలో జగన్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల. ఉద్యోగులను వాడుకుని వదిలేయడంలో జగన్ టాప్. అవసరం తీరే వరకే అన్న.. అవసరం తీరాక దున్న అన్నట్లు జగన్ వైఖరి.ఉద్యోగులు, పోలీసుల పట్ల జగన్ వ్యవహారం దుర్మార్గం. ప్రతిపక్షాల అక్రమ అరెస్టులకు అడ్డగోలుగా వాడుకుని.. అవమానకర రీతిలో సవాంగ్ ను గెంటేశారని మండిపడ్డారు. డీజీపీ స్థాయి వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వకుండా అవమానించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను అన్నా అంటూనే.. గెంటారు. పీవీ…
ఏపీ పాలనా వ్యవహారాల్లో కొత్త మార్పులకు జగన్ శ్రీకారం చుట్టారా? అంటే అవుననే అనిపిస్తోంది. తాజా పరిణామలను పరిశీలిస్తే వాస్తవం అర్ధం అవుతుంది. తనకు అత్యంత విధేయుడిగా వుండే డీజీపీ గౌతమ్ సవాంగ్ ని బదిలీ చేయడం సంచలనం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై బదిలీ వేటు వేయడం వెనుక ఏం జరిగిందోనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గౌతమ్ సవాంగ్ ని మారుస్తారని ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం తర్వాత వార్తలు వచ్చాయి. అవి…