బ్రిటన్‌లో ఓ నర్సు దారుణ ఘటనకు పాల్పడుతుంది. అప్పుడే పుట్టిన నవజాత శిశువులను చంపేస్తుంది. ఇంతకుముందు కూడా ఆ నర్సుపై పిల్లలను చంపుతున్న ఆరోపణలపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. 2016 ఫిబ్రవరిలో వాయువ్య ఇంగ్లండ్‌లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్‌లో నెలలు నిండని నవజాత శిశువును చంపడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా మరోసారి విషయం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. లూసీ లెట్బీ అనే నర్సు తాను పనిచేస్తున్న ఆసుపత్రిలో నవజాత శిశువును చంపడానికి ప్రయత్నించింది.…