నిన్న జరిగిన ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్ లో ఎట్టకేలకు ఆసీస్ జట్టు తన మొదటి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరగగా.. తమ జట్టు గెలుపొందడంపై తీవ్ర ఆనందాన్ని వ్యక్తపరిచాడు ఓ ఆస్ట్రేలియా అభిమాని. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గణపతి బప్పా మోరియా అంటూ స్టాండ్ లో గట్టిగా నినాదాలు చేశాడు. అయితే ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.