తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత నెలతో పొల్చితే డిసెంబర్ నెలల చలి తీవ్రత అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ చలి తీవ్రత కొన్ని జిల్లాల్లో అధికంగా ఉండడంలో ఆయా జిల్లాల ప్రజలు ఉదయం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ వెల్లడించిన ఉష్ణోగ్రత ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదాల మండలంలోని నల్లవల్లి గ్రామంలో 13గా కనిష్ఠ ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. అలాగే…