టాలీవుడ్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ఓ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కినేని నాగచైతన్యకు మూడు తరాల ఫ్యాన్ బేస్ ఉంది. ఇక సాయిపల్లవి డాన్స్ కు ‘ఫిదా’ కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ‘లవ్ స్టోరీ’ మూవీ భారీ అంచనాల నడుమ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ఆర్మూర్ కు చెందిన రేవంత్ (నాగచైతన్య) హైదరాబాద్ లో ఫిట్ నెస్ బేస్డ్ డాన్స్ ఇన్ స్టిట్యూట్…