తెలుగు రాష్ట్రాల్లో వరుస పరువు హత్యలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రేమ పేరుతో ముడిపడిన బంధాలు.విడిపోయి బతకడం ఇష్టంలేక ఇద్దరు కలిసి వుండాలనే నేపథ్యంలో పెళ్ళి చేసుకుని ఆనందంగా గడిపినా తల్లిదండ్రులు ఓర్వలేని స్థితిలో వుంటున్నారు. కులాలు వేరని, తక్కువ కులం ఎక్కువ కులం మంటూ పరువు ప్రతిష్టలకు పోయి పిల్లల ప్రాణాలను సైతం తీసేందుకు వెనుకాడటం లేదు. ఇరుగుపొరుగు వారు ఏమనుకుంటారు, మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. తాను అతనితో బతకడం కన్నా చావడం మేలంటూ హత్య చేస్తున్నారు. తెలంగాణ…
ప్రేమకు ఎల్లలు లేవంటారు.. హద్దులు లేవంటారు. అందుకే ఎవరు ఎవరి ప్రేమలో పడతారో ఎవరూ చెప్పలేరు. ఉదాహరణకు మీకు లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి నటించిన పడమటి సంధ్యారాగం సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో విజయశాంతి అమెరికాకు చెందిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తాజాగా అచ్చం ఇదే తరహాలో ఏపీకి చెందిన ఓ అబ్బాయి అమెరికా అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన కందుల కామరాజు- లక్ష్మీ దంపతుల…
ఎంత గాఢంగా ప్రేమించుకున్నా.. విషయం పెళ్లిదాకా వచ్చినప్పుడు కట్నకానుల వ్యవహారం తప్పకుండా తెరమీదకొస్తుంది. తాము అడిగినంత ఇస్తేనే పెళ్లికి ఒప్పుకుంటామని అబ్బాయి తరఫు వారు మొండికేస్తారు. ఇలాంటి విషయాల్లోనే తేడాలు రావడం వల్ల, ఎన్నో పెళ్లిళ్లు పెటాకులైన సందర్భాలూ ఉన్నాయి. పీకల్లోతు ప్రేమించకున్న వారు సైతం, ఆ మేటర్‌లో గొడవపడి తమ పెళ్లి రద్దు చేసుకున్న వారున్నారు. అందుకే, పెళ్లి అనగానే ఎవ్వరైనా ‘కట్నకానుకలు ఎంత, ఏమిచ్చారు’ అని చర్చించుకోవడం మొదలుపెడతారు. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ…
ఈమధ్యకాలంలో కోర్టుల్లోనూ, కోర్టుల బయట తుపాకులు, కత్తులతో కొందరు తిరుగుతున్నారు. తాజాగా రంగారెడ్డి కోర్టుల దగ్గర ఇలాంటి ఘటనే జరిగింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ రంగారెడ్డి జిల్లా కోర్టు లోకి కత్తితో ప్రవేశించాలని చూసిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయి కిరణ్ అతని మిత్రుడిని అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్ పోలీసులకి అప్పగించారు కోర్టు సెక్యూరిటీ సిబ్బంది. గత సంవత్సరం మియాపూర్ కి చెందిన ఒక యువతి తన క్లాస్ మేట్ మైనారిటీ యువకుడు…
హైదరాబాద్ లో మరో హత్య జరిగింది. సరూర్ నగర్ లో నాగరాజు హత్య ఘటన మరవక ముందే మరో పరువు హత్య జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అక్కసుతో నీరజ్ పన్వార్ అనే యువకుడిని అత్యంత విచక్షణారహితంగా పొడిచిపొడిచి హత్య చేశారు. ఈ ఘటన బేగంబజార్ షాహీనాథ్ గంజ్ లో చోటు చేసుకుంది. రెండు బైకులపై వచ్చి యువకులు ప్లాన్ ప్రకారం నీరజ్ పన్వార్ ను 20 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారని ప్రత్యక్ష సాక్షులు…
సరూర్నగర్లో నిన్న రాత్రి 9 గంటల సమయంలో పరువు హత్య చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన నాగరాజు, అశ్రీన్లు ప్రేమించుకున్నారు. అయితే వారి వివాహానికి ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పడంతో.. ఈ ఏడాది జనవరి నెలలో మతాంతర వివాహం చేసుకున్నారు. అయితే.. వారిపై పెళ్లిపై కోపం పెంచుకున్న యువతి తరుపు బంధువులు.. నిన్న నాగరాజు, అశ్రీన్లు బైక్ వెళ్తున్న సమయంలో అడ్డగించి దాడి చేసి హతమార్చారు. ఈ నేపథ్యంలో బాధితురాలు అశ్రీన్ మాట్లాడుతూ.. ఇద్దరం కలిసి…
ఏపీలో ఇటీవల ఒకే పార్టీకి చెందిన ఇద్దరు రాజకీయ నేతలు వియ్యంకులుగా మారుతున్నారు. ఇటీవల వైసీపీ నేతలు కొలుసు పార్థసారథి, బుర్రా మధుసూదన్ యాదవ్ వియ్యంకులు అయ్యారు. తాజాగా టీడీపీ నేతలు బోండా ఉమా, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబాలు కలవబోతున్నాయి. ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతితో బోండా ఉమా కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం జరగనుంది. త్వరలో జరగనున్న ఈ కార్యక్రమానికి ఇరువురు నేతలు తమ పిల్లలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించారు. జస్వంతి, సిద్ధార్థ్ ఇద్దరూ…
తమిళనాడు మంత్రి శేఖర్బాబు కుమార్తె జయకళ్యాణి ప్రేమ వివాహం చేసుకుంది. బెంగళూరులోని హిందూ ధార్మిక సంస్థలో సోమవారం నాడు సతీష్అనే యువకుడితో మంత్రి కుమార్తె వివాహం జరిగింది. తమ ప్రేమకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇలా ప్రేమ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని జయకళ్యాణి వివరణ ఇచ్చింది. అయితే తన తండ్రి నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఆమెతో పాటు ఆమె భర్త సతీష్ పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. కొన్ని నెలల క్రితం…
టాలీవుడ్ బ్యూటీ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ నిమిషం తీరిక లేకుండా తిరుగుతోంది. ఇక ఈ బిజీ షెడ్యూల్ ల్లో అమందు ప్రేమకు, పెళ్ళికి తావు లేవని చెప్పుకొస్తుంది. ఇక తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రమోషన్స్ లో ప్రేమ, పెళ్లి పై అమ్మడు నోరు విప్పింది. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. ” ఎవరి దగ్గర అయితే సెక్యూర్ గా ఫీల్ అవుతామో,…
మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుందని తన కూతురు బతికుండగానే ఓ తండ్రి శ్రద్ధాంజలి ఘటించాడు. గుండు గీయించుకుని దినకర్మలు చేయించాడు. వివరాల్లోకి వెళ్తే… మద్దూరు గ్రామానికి చెందిన మాధవి అనే యువతి అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ సమీప బంధువులే కావడంతో తమ ప్రేమను పెద్దల ముందుకు తీసుకువెళ్లారు. అయితే పెద్దలు ససేమిరా అనడంతో ఈనెల 13న గుడిలో పెళ్లి చేసుకున్నారు.…