శ్రీవారి మెట్టు మార్గంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది.. ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యయత్నం చేయడంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.. పెళ్లై.. ముగ్గురు పిల్లలు ఉన్న ఓ మహిళ.. ఓ యువకుడి ప్రేమలో పడింది. మూడు రోజుల క్రితం ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. చంద్రగిరిలోని శ్రీవారిమెట్టు నడక మార్గం 450వ మెట్టు దగ్గరకు చేరుకున్నారు. ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
Love Couple: తిరుచానూరు పోలీసుల అదుపులో విజయవాడకు చెందిన పొట్లూరి అలేఖ్య చౌదరి (26) మందడంకు చెందిన సాంబశివరావు (33) ప్రేమ జంట ఉంది. గత 11 ఏళ్లుగా అలేఖ్య, సాంబశివరావులు ప్రేమించుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు తీవ్రంగా కలచి వేస్తున్నాయి. అమ్మాయి ప్రేమించడం లేదనో, ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లాడిందనో, పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదనో ఇలా ప్రేమ పేరుతో రకరకాల కారణాల వల్ల యువతీ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
తమకు పెళ్లి జరిపించాలని వచ్చిన ఓ ప్రేమజంటకు పోలీసులు అనుకోని షాకిచ్చారు. ఉత్తర్ ప్రదేశ్లో గురువారం ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. తన ప్రేమికుడినే పెళ్లి చేసుకుంటానంటూ దరఖాస్తు ఇచ్చింది. అయితే.. ఇంతలో అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. తమ బిడ్డను కావాలని తీసుకొచ్చాడని పోలీసులకు తెలిపింది. దీంతో.. పోలీసులు అమ్మాయిని తల్లికి అప్పగించారు. కాగా.. ప్రేమికుడిపై శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు చర్యలు తీసుకున్నారు.
కాకినాడ బీచ్ వద్ద ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన స్థానికులు వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ప్రేమజంట.. ప్రత్తిపాడు మండలం పోతులూరుకు చెందిన అరుణ్, శ్రీదేవిగా గుర్తించారు.
Viral Video: ఓ యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని అడిగిన ఓ యువతిని యువకుడు దారుణంగా చితకబాదాడు. ఆమెను కిందపడేసి బూటు కాళ్లతో పిచ్చకొట్టుడు కొట్టాడు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ గ్రామంలోని రోడ్డుపై యువ జంట నడుచుకుంటూ వెళ్తున్నారు. మాటల సందర్భంలో తనను పెళ్లి చేసుకోవాలని తన వెంట ఉన్న యువకుడిని యువతి కోరింది. దీంతో అతడు తీవ్ర ఆగ్రహం…
ప్రేమించుకోవడం.. పెద్దలు అంగీకరించకపోవడం.. పెద్దలను ఒప్పించలేక ఎక్కడికో వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడం.. విడిచి ఉండలేక, కలిసి బ్రతకలేక.. ప్రాణాలు విడిచిన ఘటనలు ఎన్నో చూశాం.. తాజాగా. విశాఖ నగరంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం కలకలం రేపింది. మెడలో తాళి కట్టిన మరుక్షణమే వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిక్కోలు జిల్లా లావేరు, దూసి ప్రాంతాలకు చెందిన దామోదర్ (23), సంతోషి కుమారి సోమవారం…
ఇటీవల కాలంలో వరుసగా యువతీయువకుల ప్రేమ పలు వివాదాస్పద ఘటనలకు కారణమవుతోంది. తాజాగా ఇలాంటి ఉదంతం మరొకటి వెలుగు చూసింది. ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ఓ ప్రేమజంట ప్రేమించుకున్నారనే కారణంగా వారి కుటుంబాల మధ్య వైరం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన శ్రీజ, శివాజీ అనే యువతీయువకులు ప్రేమించుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీజ కుటుంబసభ్యులు ఆమెకు మూడురోజుల క్రితం రచ్చమర్రికి చెందిన భీమతో…