జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు దడపుట్టిస్తున్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇక్కడి రహదారులపై ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. వాహనాదారులు తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బలవంతపూర్ ప్రధాన రహదారి రక్తసిక్తమైంది.