Turkey Earthquake: భూకంపంలో టర్కీ విలవిల్లాడుతోంది. భారీ భూకంపం వల్ల గత కొన్ని దశాబ్ధాల కాలంలో ఎప్పుడూ చూడని విధ్వంసాన్ని చూస్తోంది. రిక్టర్ స్కేలుపై 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాలు టర్కీని కోలుకోలేని దెబ్బతీశాయి. భూకంపం ధాటికి టర్కీ భూభాగం 5-6 మీటర్లు పక్కకు కదిలిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారంటే, భూకంప ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టర్కీతో పాటు సిరియాను భూకంపం తీవ్రంగా నష్టపరిచింది. రెండు దేశాల్లో కలిపి ఇప్పటి వరకు…