Hindu Student: మతస్వేచ్ఛ, మత హక్కులు, మైనారిటీ హక్కుల గురించి మాట్లాడే యూకేలో హిందూ విద్యార్థిపై వివక్ష చూపించడం వివాదాస్పదంగా మారింది. తిలక్ చాండ్లోతో(నుదుట బొట్టు) వచ్చాడని 8 ఏళ్ల హిందూ విద్యార్థిని లండన్ స్కూల్ సిబ్బంది అనుచితంగా వ్యవహరించారు. తీవ్ర వివక్ష కారణంగా స్కూల్ మార్చాల్సి వచ్చింది. హిందువులు, భారతీయ కమ్యూనిటీ హక్కుల కోసం పనిచేస్తున్న ఇన్‌సైట్ యూకే అనే సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. పాఠశాల సిబ్బంది బాలుడిని తన మతాచారాన్ని వివరించాలని అడగడం…