హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంకులో దారుణం చోటుచేసుకుంది. బ్యాంకు లాకర్ గదిలో ఓ వృద్ధుడు ఉన్నాడనే విషయాన్ని గమనించకుండా సిబ్బంది బయటి నుంచి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో సదరు వృద్ధుడు 18 గంటల పాటు లాకర్ గదిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సాయంత్రం 4:20 గంటలకు కృష్ణారెడ్డి (87) అనే వృద్ధుడు లాకర్ పని మీద యూనియన్ బ్యాంకుకు వెళ్లాడు. లాకర్ గదిలో ఆయన ఉండగానే బ్యాంకు పనివేళలు ముగియగానే సిబ్బంది…