Hema Malini: బాలీవుడ్ నటి, మూడు సార్లు బీజేపీ తరుపున ఎంపీగా ఉన్న హేమమాలిని ఉత్తర్ ప్రదేశ్ మధుర ఎంసీ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. తాజాగా ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో ఆమె ఆస్తుల విలువ దాదాపుగా రూ.122 కోట్లు ఉంటుందని ప్రకటించారు. ఎన్నికల అఫిడవిట్‌లో నటన ఆమె తన వృత్తిగా ప్రకటించారు. అద్దె, వడ్డీ లాభాలను ఇన్‌కమ్ సోర్స్‌గా పేర్కొన్నారు. తన భర్త ధర్మేంద్ర డియోల్‌కి సంబంధించి యాక్టివ్, పెన్షన్, వడ్డీలను ఆదాయ మార్గాలుగా తెలిపారు.
Read Also: The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ని టెలికాస్ట్ చేయొద్దు.. దూరదర్శన్‌ని కోరిన కేరళ సీఎం..
201, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వరసగా హేమమాలిని మధుర నుంచి గెలుపొందారు. ఈ సారి మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని అనుకుంటున్నారు. ఆమెకు దాదాపుగా రూ. 1.4 కోట్ల అప్పులు ఉండగా.. ఆమె భర్తకు రూ. 6.4 కోట్లు అప్పుగా ఉండని, అతని ఆస్తుల విలువ రూ. 20 కోట్లుగా పేర్కొంది. హేమమాలినిపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్ లో లేవని అఫిడవిట్ పేర్కొంది. హేమమాలినికి రూ. 13.5 లక్షల నగదు, భర్త ధర్మేంద్ర డియోల్‌కి రూ. 43 లక్షల నగదు చేతిలో ఉన్నట్లు పేర్కొన్నారు. మెర్సిడస్ బెంజ్, అల్కజర్, మారుతి ఈకో సహా రూ. 61 లక్షల విలువైన వామనాలనను హేమమాలిని కలిగి ఉన్నారు. ధర్మేంద్ర డియోల్ రేంజ్ రోవర్, మహీంద్రా బొలెరో మరియు ఒక మోటార్ సైకిల్‌ను కలిగి ఉన్నారు.