పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)కు భారీ షాక్ తగిలింది. న్యూజీలాండ్ స్పీడ్‌స్టర్ లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు. శనివారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెర్గూసన్ గాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో రెండు బంతులు మాత్రమే బౌలింగ్ చేసిన అతడు తీవ్రమైన తొడ నొప్పితో మైదానాన్ని వీడాడు. ఫిజియోతో కలిసి మైదానాన్ని వీడిన ఫెర్గూసన్.. మరలా బౌలింగ్ చేయడానికి రాలేదు. ఫెర్గూసన్ లేని లోటు ఆ మ్యాచ్‌లో తీవ్ర ప్రభావం చూపింది.…
ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సీజన్లో గుజరాత్, పంజాబ్ జట్లకు ఇదే మొదటి మ్యాచ్. ఈ నేపథ్యంలో విజయంతో టోర్నీని ఆరంభించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. రెండు టీమ్స్ బలంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. గుజరాత్‌కు శుభ్‌మాన్ గిల్, పంజాబ్‌కు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహిస్తున్నారు. గత సీజన్‌లో కోల్‌కతా నైట్…
Lockie Ferguson Creates History in T20 World Cup: న్యూజిలాండ్ పేస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లోనే అత్యంత పొదుపుగా (అత్యుత్తమ ఎకానమీ) బౌలింగ్ చేసిన బౌలర్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా పసికూన పాపువా న్యూగినీతో జరిగిన మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా.. మూడు వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యుత్తమ ఎకానమీ నమోదు చేసిన బౌలర్‌గా ఫెర్గూసన్ అరుదైన…