మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటించిన ఎమోషనల్ డ్రామా ‘లాక్‌డౌన్’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఏఆర్ జీవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాదే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, తమిళనాడులో సంభవించిన తుపానులు, ఇతర సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ‘ప్రతి విరామానికి ఓ అర్థం ఉంటుంది’ అనే క్యాప్షన్‌తో ఈ నెల 30న…