Operation Sindoor: భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఇంకా కొనసాగుతోందని, భవిష్యత్తులో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి దిగితే, సమాధానం చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. సరిహద్దు వెంబడి 8 ఉగ్రవాద శిబిరాలు చురుకుగా ఉన్నాయని, వీటిలో 6 నియంత్ర రేఖ వెంబడి, మరో రెండు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్నాయని చెప్పారు. ఢిల్లీలో జరిగిన వార్షిక విలేకరుల సమావేశంలో ద్వివేదీ ఈ వ్యాఖ్యలు చేశారు. Read…
ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంటు వర్షాకాల సమావేశంలో రెండవ రోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోమవారం కూడా లోక్ సభలో అర్ధరాత్రి 12 గంటల వరకు చర్చించారు. తాజాగా ఈ అంశంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడారు. పహల్గాంలో టూరిస్టులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారని రాహుల్ గాంధీ అన్నారు.