లోన్ యాప్ ల వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లోన్ యాప్స్ మొదట్లో బాగానే లోన్స్ ఇస్తున్నాయి. అవి వసూల్ చేసేటపుడు మాత్రం జనాలకు చుక్కలు చూపెడుతున్నాయి. ఈజీగా లోన్ వస్తుందని ఎంతో మంది తీసుకుంటున్నారు. త్వరగా, సులభంగా డబ్బు లభిస్తుండటంతో చాలా మంది వీటిపై ఆధారపడుతున్నారు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థిక సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. మోసాలు, ఆర్థిక నష్టాల బారిన పడకుండా ఉండటానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించాలని న్యాయ నిఫుణులు చెబుతున్నారు.…
Moneylenders Harassment: వడ్డీ వ్యాపారుల అరాచకాలు రాష్ట్రంలో మళ్లీ చవిచూస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని నులకపేటలో వడ్డీ వ్యాపారుల వేధింపులు విషాదానికి దారితీశాయి. అప్పులబారిన పడిన పూజారి భార్య కృష్ణవేణి (మహిళ) వడ్డీ వ్యాపారుల నుంచి ఎదురైన మానసిక వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసింది. Brooklyn Shooting: కాల్పులతో దద్దరిల్లిన న్యూయార్క్.. స్పాట్‌లో ముగ్గురు మృతి అందిన సమాచారం ప్రకారం.. సదరు మహిళా నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగింది.…
Online Betting: కామారెడ్డిలో బెట్టింగ్ మోజు ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో 80 లక్షలకుపైగా కోల్పోయి అప్పుల బాధలో మునిగిపోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సంజయ్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. భార్య శ్రీలత కన్నీరుమున్నీరవుతూ.. అప్పుల బాధల వల్లే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, బెట్టింగ్ యాప్‌లను తక్షణమే నిషేధించాలని కోరింది. అలాగే, ఎవరైనా అప్పు ఇచ్చే ముందు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి అంటూ వాపోయింది.…
Loan Harassment : ఈ నెల 7వ తేదీన లోన్ యాప్ వేధింపులకు బలైన యువకుడు కుటుంబం నిరసన కు దిగింది.. న్యాయం చేయాలని జిల్లా కలెక్టరేట్ వద్ద లోన్ యాప్ కి బలైన మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ కు విన్నవించుకోగా ఆదుకుంటామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోయిందని వాపోయారు.. నేటికీ 10 రోజులు గడుస్తున్నా బాధిత కుటుంబానికి న్యాయం జరగడం లేదని, ఆ కుటుంబానికి…
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన కుటుంబం ఇటీవల విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండడంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ సురేష్ సెల్ఫీవీడియో లభ్యమైంది. అయితే ఈ సెల్ఫీ వీడియోని కుటుంబసభ్యులు పోలీసులకు అందజేశారు. జ్ఞానేశ్వర్‌కు రూ.40 లక్షలు వడ్డీరూపంలో చెల్లించానని, వడ్డీ వ్యాపారి గణేష్‌కి రూ.80 లక్షలు చెల్లించానని వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ సెల్ఫీవీడియోలో సురేష్…