Moneylenders Harassment: మరీ ఇంత దారుణమా.. అప్పు తీర్చేందుకు రైతుతో కిడ్ని అమ్మించిన వడ్డీ వ్యాపారులు..
- అమానుషంగా వ్యవహరిస్తున్న వడ్డీ వ్యాపారులు
- అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్న వ్యాపారులు
- అప్పులు తీర్చేందుకు కిడ్నీ అమ్ముకునే పరిస్థితి తెచ్చిన వ్యాపారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్పులు తీర్చలేకపోయిన రైతులను లక్ష్యంగా చేసుకుని కొందరు అక్రమ వడ్డీ వ్యాపారులు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. రైతుల ఆర్థిక బలహీనతను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలతో అప్పులు ఇచ్చి, చివరికి వాటిని తీర్చేందుకు రైతులు తమ కిడ్నీలను అమ్ముకునే పరిస్థితి వరకు తీసుకువచ్చిన దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు చట్టపరమైన రక్షణతో పాటు తక్షణ ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే… మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన రోషన్ సదాశివ్ కుడే అనే రైతు ఈ దారుణానికి బలయ్యాడు. వ్యవసాయం ద్వారా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో, అదనపు ఆదాయం కోసం పాల వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పెట్టుబడి కోసం పలువురు వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి రోజుకు రూ.10 వేల వడ్డీకి రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. అయితే, ఆ అప్పును సకాలంలో తీర్చలేకపోవడంతో వడ్డీ భారం పెరిగి మొత్తం అప్పు రూ.74 లక్షలకు చేరుకుంది.
Also Read
- Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
అతడు కొనుగోలు చేసిన ఆవులు చనిపోవడం, సాగు చేసిన పంటలు నష్టపోవడంతో సదాశివ్ పరిస్థితి మరింత దిగజారిపోయింది. అప్పులు తీర్చలేని స్థితికి చేరుకున్న అతడిని వడ్డీ వ్యాపారులు తీవ్రంగా వేధించడం ప్రారంభించారు. చేసేదేమీ లేక తన భూమి, ట్రాక్టర్‌తో పాటు ఇంట్లోని విలువైన గృహోపకరణాలను కూడా అమ్మేశాడు. అయినప్పటికీ అప్పు మొత్తం తీరలేదు.
ఈ పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల్లో ఒకరు కిడ్నీ అమ్ముకోవాలని సదాశివ్‌కు అమానుషమైన సలహా ఇచ్చాడు. ఆ మాటలతో మానసికంగా కుంగిపోయిన సదాశివ్, ఒక ఏజెంట్ సహాయంతో ముందుగా కోల్‌కతాకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి కంబోడియాకు తీసుకెళ్లి శస్త్రచికిత్స ద్వారా అతని కిడ్నీని తొలగించారు. కిడ్నీ అమ్మకానికి ప్రతిఫలంగా అతడికి కేవలం రూ.8 లక్షలు మాత్రమే ఇచ్చారు.
కిడ్నీ అమ్ముకున్నప్పటికీ అప్పులు పూర్తిగా తీరలేదని, దీంతో తాను తీవ్రంగా మోసపోయానని సదాశివ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని అతడు వాపోయాడు. న్యాయం జరగకపోవడంతో మానసికంగా, శారీరకంగా తీవ్ర వేదన అనుభవిస్తున్నానని.. తనకు న్యాయం జరగకపోతే కుటుంబంతో సహా మహారాష్ట్ర సచివాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని తెలిపాడు.
ఈ ఘటన రైతుల దయనీయ స్థితికి అద్దం పడుతోంది. రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమ వడ్డీ వ్యాపారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక వర్గాలు, రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రైతులకు చట్టపరమైన భద్రత, ఆర్థిక మద్దతు అందించడం అత్యవసరమని వారు స్పష్టం చేస్తున్నారు.
తాజావార్తలు
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Vishwambhara : రూట్ క్లియర్.. విశ్వంభర వచ్చేస్తోంది
-
Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
-
iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!