Vijay Mallya: పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై ముంబైలోని ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు సంబంధించిన రూ.180 కోట్ల రుణాన్ని ఎగవేసినందుకు విజయ్ మాల్యాపై ఉన్న కేసుకు సంబంధించి ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది.