కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ (రామ్‌విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ దేశవ్యాప్తంగా కుల గణనను సమర్థించారు. అయితే ఈ లెక్కలను బహిరంగపరచడం వల్ల సమాజంలో 'విభజన' ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీని కలవలేకే తన తండ్రి రామ్‌విలాస్ పాశ్వాన్ యూపీఏ నుంచి బయటకు వచ్చేశారని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాబాయ్, అబ్బాయ్ మధ్య తలెత్తిన విబేధాలు లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)లో తారాస్థాయి చేరుకున్నాయి.. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ను ఎల్జేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించే విధంగా అతడి బాబాయ్, ఎంపీ పశుపతి కుమార్ పరాస్ పావులు కదిపారు.. ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు.. లోక్‌సభ స్పీకర్‌ను కలిసి.. తమ నేత పరాస్ అని విన్నవించారు.. ఇక, ఆ తర్వాత బాబాయ్, అబ్బాయి మధ్య మాటల యుద్ధమే…