కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు ప్రతిష్టంభన తొలగింది. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు లైన్ క్లియరైంది. తెలంగాణలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయిన నేపథ్యంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో కిషన్‌రెడ్డి మాట్లాడి పరిస్థితిని వివరించారు. రైతులను ఆదుకోవాలని కోరారు.
షీనా బోరా సెన్సేషనల్ హత్య కేసుపై ది ఇంద్రాణి ముఖర్జియా: ది బరీడ్ ట్రూత్ అనే డాక్యుమెంటరీ సిరీస్ తెరకెక్కిన విషయం తెలిసిందే.. అయితే ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రాకముందే చర్చనీయాంశంగా మారింది.షీనా బోరా హత్య కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా నిందితురాలిగా ఉండడం సహా చాలా సంచలన విషయాలు, మలుపులు ఉన్న కేసు కావడంతో ఈ సిరీస్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే, నెట్‍ఫ్లిక్స్ ఓటీటీటీలో రానున్న ఈ సిరీస్‍ను స్ట్రీమింగ్‍కు రాకుండా…
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరణ చేయటానికి జీవో నెంబర్ 16ను నిలిపి వేస్తూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. తాజాగా ఈ పిల్ నంబర్ 122/2017 ను కొట్టి వేసింది కోర్ట్. అలాగే ఈ పిటిషన్ వేసిన వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా వేసింది. అయితే క్రమబద్దీకరణకు అనుకూలంగా వాదించింది ప్రభుత్వం. ఈ క్రమబద్ధీకరణకు 2016లో…