The Indrani Mukerjea Story : సీబీఐ పిటిషన్ కొట్టేసిన కోర్టు.. స్ట్రీమింగ్ కి లైన్ క్లియర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షీనా బోరా సెన్సేషనల్ హత్య కేసుపై ది ఇంద్రాణి ముఖర్జియా: ది బరీడ్ ట్రూత్ అనే డాక్యుమెంటరీ సిరీస్ తెరకెక్కిన విషయం తెలిసిందే.. అయితే ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రాకముందే చర్చనీయాంశంగా మారింది.షీనా బోరా హత్య కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా నిందితురాలిగా ఉండడం సహా చాలా సంచలన విషయాలు, మలుపులు ఉన్న కేసు కావడంతో ఈ సిరీస్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే, నెట్‍ఫ్లిక్స్ ఓటీటీటీలో రానున్న ఈ సిరీస్‍ను స్ట్రీమింగ్‍కు రాకుండా ఆపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోర్టులో పిటిషన్‍ను ఇటీవల దాఖలు చేసింది. ఫిబ్రవరి 23వ తేదీన ది ఇంద్రాణి ముఖర్జియా: ది బరీడ్ ట్రూత్ డాక్యు సిరీస్ స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ప్రకటించింది. అయితే, ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, ఈ సిరీస్ వస్తే ఇన్వెస్టిగేషన్ ప్రభావితం అవుతుందని ముంబైలోని ఓ ప్రత్యేక కోర్టులో సీబీఐ కేసు వేసింది. అయితే, వాదనలు విన్న న్యాయస్థానం ఈ సిరీస్ స్ట్రీమింగ్‍ను ఆపాలని ఆదేశించే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. దీంతో ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు లైన్ క్లియర్ అయినట్లయింది.
ఆ సిరీస్ బ్రాడ్‍కాస్ట్‌ను ఆపే స్వాభావిక అధికారం కోర్టుకు లేదని, సంబంధిత ఫోరమ్‍ను సంప్రదించాలని సీబీఐ స్పెషల్ జడ్జి ఎస్‍పీ నాయక్ నింబల్కర్ సీబీఐకు సూచించారు. దీంతో 23వ తేదీన ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు మార్గం సుగమమైంది.ది ఇంద్రాణి ముఖర్జియా: ది బరీడ్ ట్రూత్ సిరీస్‍లో షీనా బోరా హత్య కేసులో నిందితులతో పాటు సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారని, విచారణ ముగిసే వరకు ఇది స్ట్రీమ్ కాకుండా ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని సీబీఐ తరఫున కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీకే నందోడ్ గత వారం పిటిషన్ వేశారు. నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జియా ఈ డాక్యుమెంటరీకి స్క్రిప్ట్ మరియు మెటీరియల్ అందించి ఉండొచ్చని, విషయాలను వక్రీకరించే అవకాశం ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులతో పాటు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీకి కూడా కోర్టు నోటీసులు పంపింది.దీనిపై ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. ఏదైనా కంటెంట్ బ్లాక్ చేయాలంటే నిబంధనల ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ సెక్రటరీ ప్రదిపాదించాల్సిందిగా కోర్టు తెలిపింది.అలాంటిది ఏమీ సమర్పించనందున సీబీఐ వేసిన పిటిషన్‍ను తిరస్కరించింది.
Also Read
- జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!