ఢిల్లీలో వాయు కాలుష్యం దారుణంగా ఉంది. అధిక కాలుష్యంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను వేర్వేరు సమయాల్లో తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10:00 నుండి సాయంత్రం 6:30 వరకు తెరిచి ఉంటాయి.
ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్తగా ఎన్నికకానున్న ముఖ్యమంత్రికి పని అప్పగించారు. అపరిశుభ్రతకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. పశ్చిమ ఢిల్లీలో లక్షలాది మంది ప్రజలు నరకం కంటే హీనమైన జీవితాన్ని గడపాల్సి వస్తోందని ఎల్‌జీ పేర్కొన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇందుకోసం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే.సక్సేనా అపాయింట్‌మెంట్ ఇచ్చారు. వీకే.సక్సేనాను కేజ్రీవాల్ కలిసి తన పదవికి రాజీనామా చేయనున్నారు. లిక్కర్ పాలసీ కేసులో ఇటీవలే కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం-లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనా మధ్య వార్ మరింత ముదురుతోంది. ఇప్పటికే ఇరువర్గాల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఎల్జీ తీసుకున్న నిర్ణయంతో ఆ జ్వాలలు మరింత రేకెత్తిస్తున్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాకు రాసిన లేఖ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారాన్ని తీహార్ జైలు అధికారులు తీవ్రంగా పరిగణించారు. జైలు నిబంంధనలు ఉల్లంఘించడమేనని అధికారులు హెచ్చరిస్తున్నారు.