MLC Lella AppiReddy: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, వ్యవస్థలను పతనం చేసి గెలిచారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. ఓటింగ్ కు ముందు పోలింగ్ కేంద్రాలను మార్చి ఓటర్లకు గందరగోళానికి గురి చేశారని పేర్కొన్నారు.
టీడీపీ పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది వైసీపీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంచుతోందని ఎస్ఈసీ కి ఫిర్యాదు చేసారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి. దొంగ ఓటర్లను తరలిస్తున్నారని ఫిర్యాదు చేసారు. స్థానిక ఎన్నికల్లో టిడిపి అక్రమాలకు పాల్పడుతోంది. చంద్రబాబు పాట్లు చూస్తే జాలి కలుగుతోంది. ఉనికి కోసం నానా రకాలుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఓటుకు ఐదు వేలు నుంచి పదివేలు ఇస్తున్నారు. అధికారులను బెదిరిస్తున్నారు. ఏ…