సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. సీఎం పై తెలంగాణ బిజెపి వేసిన పరువు నష్టం దావా పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ కీలక వాఖ్యలు చేశారు. రాజకీయ పోరాటాలకు కోర్టును వేదిక చేసుకోవద్దని, కోర్టులు ఈ విషయాన్ని పదే పదే చెప్తూనే ఉన్నాయన్నారు చీఫ్ జస్టిస్. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి అని స్పష్టం చేశారాయన. కేసు…
క్వారీ యజమాని మనోజ్ రెడ్డి బెదిరింపు కేసులో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కాజీపేట లోని రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14 రోజుల రిమాండ్ విధించారు. కౌశిక్ రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. పటిష్ట భద్రత నడుమ కౌశిక్ రెడ్డిని ఖమ్మం తరలించనున్నారు. అర్ధరాత్రి అరెస్ట్ అనంతరం.. ఉదయం నుంచి సుబేదారి పిఎస్ దగ్గర హైడ్రామా కొనసాగతోంది.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఇప్పుడు సెల్ ఫోన్ చుట్టూనే తిరుగుతుంది.. కేటీఆర్ సెల్ఫోనే ఏసీబీ అధికారులకు కీలకంగా మారింది.. సెల్ఫోను ఇచ్చేది లేదని కేటీఆర్ ఏసీబీకి కరాకండిగా తేల్చి చెప్పారు.. గతంలో వాడిన సెల్ ఫోను ఇప్పుడు తన దగ్గర లేదని, ఇప్పుడు కొత్త ఫోన్ వాడుతున్నానని చెప్పారు.. ఇందుకు సంబంధించి లిఖిత పుర్వకంగా ఏసీబీ అధికారులకు కేటీఆర్ సమాధానం పంపాడు.. అయితే సెల్ఫోన్ ఇవ్వకపోతే తదుపరి చర్యలకు తాము సిద్ధమని ఏసీబీ అధికారులు…
సుప్రీంకోర్టులో గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసుపై విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్ ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. హత్యకు గురయ్యే ముందు వామన్ రావు మాట్లాడిన వీడియోలో పుట్ట మధు పేరు ఉందా లేదా అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను కోర్టుకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై పూర్తి పరిశీలన తర్వాతే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంశీ సహా మరో ఇద్దరు నిందితుల పోలీస్ కస్టడీ ఆదేశాలు రద్దు చేయాలని ఏ7, ఏ8 తరఫు న్యాయవాది చిరంజీవి మెమో దాఖలు చేశారు.
లగచర్లలో అధికారులపై దాడి కేసులో నిందితులందరికీ నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ను మంజూరు చేసింది. పట్నం నరేందర్ రెడ్డితో పాటు సురేష్, మిగతా నిందితులు అందరికీ బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
క్యాట్ తీర్పుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. సివిల్ సర్వెంట్ల నియామకాలను నిర్ధారించలేమని స్పష్టం చేస్తూ, ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనర్థకమని హైకోర్టు పేర్కొంది. ఐఏఎస్ అధికారుల బదిలీపై స్టే ఇవ్వడం జరగదని, సంబంధిత వ్యక్తులు ముందుగా అక్కడ వెళ్లి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అధికారులు ముందు వెళ్లి రిపోర్ట్ చేయాలని, కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి రిపోర్ట్ చేసిన తర్వాతే విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది.…