గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువును నిర్ణయించిన సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పును ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ తాజాగా విమర్శించారు. అలాంటి ఆదేశం దేశ అత్యున్నత కార్యాలయం యొక్క రాజ్యాంగ పాత్రను దెబ్బతీస్తుందని అన్నారు. న్యాయస్థానాలు రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.
ఐటీడీపీ నేత చేబ్రోలు కిరణ్ కి మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిని దూషించిన కేసులో కిరణ్ కు రిమాండ్ విధించారు. కిరణ్ పై 111 సెక్షన్ పెట్టడంతో మంగళగిరి రూరల్ సీఐపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. మీ ఇష్టానుసారంగా సెక్షన్లు పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి సీఐ శ్రీనివాసరావుకు ఛార్జ్ మోమో ఇవ్వాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. లిఖిత పూర్వక వివరణ…