తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంటింటికీ మంచినీరు అందించే పథకం రోడ్లపై ఆవిరైపోతోంది. వరంగల్ జిల్లా ఖానా పురం మండలం వేపచెట్టు తండా సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ పగిలి నీరు చిమ్మడంతో ఆదివారం అర్ధరాత్రి జాతీయ రహదారి జలమయమైంది.