తాజాగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు. ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో డ్రోన్ లతో పెట్రోలింగ్ మొదలు పెట్టారు అధికారులు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆపరేషన్ మొదలుపెట్టి దశల వారీగా కమిషనరేట్ వ్యాప్తంగా అమలు చేస్తామని సిపి శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెద్దపల్లిలో జరిగే అసాంఘిక శక్తుల నిర్మూలనకు, అలాగే ప్రజల పద్ధతులు కొరకు ఈ సేవలు మొదలు పెట్టామని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తాము…