Gangster Goldy Brar: ఫేమస్ పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలాను రెండేళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ముఠా హతమార్చింది. 2022 మేలో పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని సొంతూరులో తన ఎస్‌యూవీ కారులో ప్రయాణిస్తున్న సమయంలో, అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. దీంతో మూసే వాలా అక్కడిక్కడే మరణించాడు. ఆయన ప్రయానిస్తున్న కారుపైకి 100 కన్నా ఎక్కువ బుల్లెట్లు ఫైర్ చేశారు.
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరు షార్ప్ షూటర్లను అరెస్ట్ చేశారు. అరెస్టయిన ముష్కరులలో దీపాంశు అలియాస్ మోను, మొయినుద్దీన్ అలియాస్ సల్మాన్ ఉన్నారు. వీరిద్దరూ సల్మాన్ త్యాగి గ్యాంగ్‌కు చెందినవారు కాగా.. సల్మాన్ త్యాగికి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉంది.